బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
జనాభాలో56% ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా అగ్రకుల నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రం లో పార్టీలకతీతంగా అన్ని కుల సంఘ నాయకులు సంపూర్ణ బందుకు సహకరించారు. అనంతరం జాతీయ రహదారి 44 పై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్లు చెల్లవని తెలిసే అగ్రకుల నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేసే ఏ పార్టీని కూడా వదిలి పెట్టే ప్రసక్తే లేదని, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరించారు.. తెలంగాణ రాష్ట్ర బంద్ ఎవరు పై పోరాటం చేస్తున్నట్లు?? అని మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది 42% శాతం రిజర్వేషన్ల కోసం BC సంఘాలు చేపట్టాయి దానికి కాంగ్రెస్ మిత్రపక్ష ,BJP, BRS, సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే మరి బందు ఎవరికి వ్యతిరేకంగా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్నది ప్రజల్లో ప్రశ్నగా మారింది?

