బాధిత కుటుంబానికి బియ్యం వితరణ.
టేకులపల్లి, పరివర్తన అవాజ్ జనవరి 09, టేకులపల్లి మండలం, సులానగర్ గ్రామానికి చెందిన సూరేపల్లి రాములు ఇటీవల గుండెపోటుతో మరణించగా సులానగర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ గుగులోత్ లక్ష్మా నాయక్, మాజీ ఉపసర్పంచ్ ఉండేటి బసవయ్య లు గ్రామ యువకులతో కలిసి చనిపోయిన రోజు కొంత నగదును, దినకర్మల కొరకు 50 కిలోల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందించి పరమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరములుగా సులానగర్ గ్రామంలో ఎవరు మరణించిన కూడా తమ వంతు సహాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తోడేటి యాకూబ్, కుమ్మరి చౌదరి, బల్లి బిక్షం, బోడ రమేష్, కేలోత్ రామకుమార్, జంగం ఎలేష, తదితరులు పాల్గొన్నారు.

