బాధితు కుటుంబ సభ్యులను పరిమర్శించిన మాజీ ఎమ్మెల్యే ఏం పద్మ దేవేందర్ రెడ్డి.
పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 27 మెదక్ మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన మంగ సంధ్యారాణి, కూతురు మంగ. చందన కర్నూల్ సమీపంలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం శివ్వాయిపల్లి పల్లి గ్రామానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఏం.పద్మ దేవేందర్ రెడ్డి చేరుకొని సంధ్యారాణి,చందన మృత దేహాలకు పూలమాలలు వేసే నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు ఆనంద గౌడ్,సిద్ధ గౌడ్,లను పరామర్శించి మనోధైర్యాన్ని తెలిపారు. బస్సు అగ్నిప్రమాదంలో తల్లి,కూతురు సజీవ దాహనం కావడం చాలా బాధాకరమని అన్నారు.వీరి వెంట మెదక్ మండల పార్టీ అధ్యక్షులు అంజ గౌడ్,రైతు బందు మండల మాజీ అధ్యక్షులు కొత్తపల్లి. కిష్టయ్య,మాజీ ఎంపిటిసి సిద్దయ్య, మాజీ సర్పంచ్ మాదవి రవీందర్, పాపన్నపేట్ మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్,నాయకులు నరేందర్, విట్టల్, తదితరులు ఉన్నారు.

