బాడీబిల్డింగ్ లో సత్తా చాటిన రామాయంపేట యువత
రామయంపేట పరివర్తన ఆవాజ్ డిసెంబర్ 5 : ఐసీఎన్ షోలో పథకాల పంట పథకాలు సాధించిన వివేక్ వర్ధన్ సాయి వర్ధన్ డాక్టర్సతీష్ రామయంపేట ప్రతిష్టాత్మక ఐసీఎన్ (ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ అండ్ న్యూట్రిషన్) అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ షోలో రామాయంపేట యువకులు సత్తా చాటారు. రామయంపేట పట్టణంలోని ‘ఫైట్ టు ఫిట్’ జిమ్ ట్రైనర్ బత్తిని శ్రీకాంత్ ఆధ్వర్యంలోని బృందం, ఇటీవల గోవాలో జరిగిన ఐసిఎన్ పోటీలలో పాల్గొన్నారు. వివేక్ వర్ధన్ అద్భుత ప్రదర్శన కనబరిచి 3వ స్థానం దక్కించుకోగా, సాయి వర్ధన్ గట్టి పోటీ మధ్య 4వ స్థానంతో తన ప్రతిభను చాటారు. డా.సతీష్ అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.శిక్షణ, పట్టుదలతో ఈ స్థాయి విజయాన్ని సాధించిన యువకులను కోచ్ శ్రీకాంత్, రామాయంపేట ప్రజలు అభి
నందించారు.

