-
ప్రశాంతంగా కొనసాగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్!!
పరివర్తన అవాజ్ హైదరాబాద్:నవంబర్ 11 , బీహార్ శాసనసభ ఎన్నికల ఆఖరి విడత పోలింగ్ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వర కు పోలింగ్ కొనసాగనుంది. ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.వీరికోసం 45 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో సీఎం నితీశ్ కుమార్ మంత్రి వర్గంలోని 12 మంది మంత్రులు కూడా పోటీలో ఉన్నారు.ఎన్డీయే కూటమిలోని చిన్న పార్టీ అయిన హిందూస్థానీ అవామీ పోటీ చేస్తున్న 6 స్థానాలు ఈ ఆఖరి విడతలోనే ఉన్నాయి.కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ కుమార్, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత షకీల్ అహ్మద్ ఖాన్, సీపీఐ ఎంఎల్ శాసన సభా పక్ష నేత మెహబూబ్ అలమ్ పోటీ చేసే స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14 అన్ని నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నెల 6న బీహార్లో 121 స్థానాలకు పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే.
ప్రశాంతంగా కొనసాగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్!!
Previous Articleరంగారెడ్డి జిల్లాలో వలస కార్మికుడి దారుణ హత్య?
Next Article జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పలు ప్రాంతాల్లో ఘర్షణలు
Related Posts
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
© 2026 Parivarthana Awaaz . Designed by Creativals.com.

