ప్రపంచ టీబీ దినోత్సవం: టీబీ ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమం ప్రారంభం
{ కామారెడ్డి పరివర్తన ఆవాజ్} ప్రపంచ టీబీ దినోత్సవము మార్చి 24 టీబి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం ప్రారంభోత్సవం జిల్లావైద్య ఆరోగ్య ఆధ్వర్యంలో వరల్డ్ టీబీ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని జి జి హెచ్ ఏరియా ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ వందరోజుల కార్యక్రమం డిఎంహెచ్వో జిల్లా మెడికల్ మరియు ఆరోగ్య శాఖ అధికారి రవీందర్ గౌడ్ గారు ప్రారంభించడం జరిగింది ఈకార్యక్రమం కార్యక్రమం 100 రోజులపాటు సెంట్రల్ టిబి డివిజన్ ఎంపిక చేసిన 118 గ్రామాలలో జిల్లా వ్యాప్తంగా హ్యాండిల్ ఎక్స్రే ద్వారా గ్రామాలలోనే టీబీ స్క్రీనింగ్ జరిపి నిర్ధారిత పేషెంట్లకు ఆరు నెలలపాటు ఉచిత మందులు మరియు పౌష్టిక ఆహారం నిమిత్తం నెలకు వెయ్యి రూపాయల చొప్పున వారి ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందని డిఎంహెచ్వో ఈ సందర్బంగా తెలిపినారు RMOసంతోష్ , యుపి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ చందన ప్రియ ,ఏ ఆర్ టి మెడికల్ ఆఫీసర్ స్నేహ , టీబి ప్రోగ్రాం ఆఫీసర్ ప్రదీప్ డిపిఓ పద్మజ డిపిపిఎం శోభారాణి ఎన్టీఈ పీ సిబ్బంది శ్యామ్ కుమార్ విజయ్, కిరణ్ కుమార్,శరత్, రేఖ,కామారెడ్డి టీబి డివిజన్ సూపర్వైజర్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.





