ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
ధాన్యం కొనుగోలు ను వేగవంతం చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడలి అధికారుల సమీక్షలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు
అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 25 , శుక్రవారం కలెక్టర్ సమీకృత కార్యాలయం లోని సమావేశ మందిరంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, వైద్య ఆరోగ్య, విద్య, పంచాయతీ, పంచాయతీరాజ్, నీటిపారుదల, వ్యవసాయ, పౌరసరపర, శ్రీ సంక్షేమ, పారిశ్రామిక, ఎస్సీ ఎస్టీ బీసీ అభివృద్ధి శాఖల, గృహ నిర్మాణ, విద్యుత్, మున్సిపాలిటీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ రావ్ మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాను అన్నారు.
నూతన పిహెచ్సి, సబ్ సెంటర్ల నిర్మాణం జరగాలన్నారు. రామాయంపేట హాస్పిటల్ కు నూతన డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు .
కొత్తపల్లి బ్రిడ్జి, శంకరంపేట్.. మెదక్ రోడ్ పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. దూప్ సింగ్ తండా ఏడుపాయల రోడ్డు, ఏడుపాయల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పాపన్నపేట్ ,కొత్తపల్లి కాలువల మరమ్మతులు చేయాలని రాయినపల్లి, కొంటూరులలో నిర్మాణాలు చేపట్టాలన్నారు.
ధాన్యం కొనుగోలు ను మరింత వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. లోడింగ్ అన్లోడింగ్ కు వాహనాలు సిద్ధం చేశామని, హమాలి కూడా పూర్తి అందుబాటులో ఉందన్నారు. అధికారుల సమన్వయంతో ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో అపరిశుభ్రం, వీధి దీపాలు వెలగడం లేదని సమస్య ఉందని ఫిర్యాదులు వచ్చాయని, పంచాయతీ అధికారిని త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ ,పట్టణ ప్రాంతాల్లో నిరంతరం పాగింగ్ జరగాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో కాలుష్య నివారణ చేయాలన్నారు. ప్రజలకు కాలుష్యం ఇబ్బంది ఉంటే ఎంత పెద్ద వారినైనా వదలకుండా ప్రజల గురించి నేను పోరాడుతానని ఉద్ఘాటించారు. అసలైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు అందించాలన్నారు. కొన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై కరెంటు తీగలు వేలాడుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయని దాని విద్యుత్ అధికారులు సరి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అధికారులు ప్రజలతో బాధ్యతగా వ్యవహరించి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.పాత పనులు త్వరగా పూర్తి చేసి,నూతన పనులు ఎమైన ఉంటే ప్రణాళికలు చేసి పంపాలన్నారు. అధికారులు పంపిన ప్రణాళికలు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
నిజమైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. జిల్లాలో ఉన్న పెండింగ్ పనులన్నీ పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీవో రమాదేవి అధికారులు పాల్గొన్నారు.

