పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న అదనపు ఎస్పీ ఎస్ మహేందర్
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా, ఈ రోజు చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేగుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి సేవాభావాన్ని చాటారు. రక్తదానం చేసిన సిబ్బందిని మరియు యువతను అదనపు ఎస్పీ ప్రశంసించి వారికి సర్టిఫికేట్లు అందజేశారు. అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ మాట్లాడుతూ, పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందువరసలో ఉంటారు. ముఖ్యంగా రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో, ప్రమాద పరిస్థితుల్లో ఉన్నవారికి, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలవుతుంది. రక్తదానం ఒక మహత్తరమైన సేవ — ఇది మనిషి ప్రాణాలను కాపాడే పవిత్రమైన కార్యం అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డి.ఎస్.పి. శ్రీ నరేందర్ గౌడ్ , రామాయంపేట సి.ఐ. శ్రీ వెంకట రాజా గౌడ్ , తూప్రాన్ సి.ఐ. శ్రీ రంగా కృష్ణ, ఎస్.ఐలు శ్రీ చైతన్య రెడ్డి, శ్రీ శంకర్ , శ్రీ సుభాష్ గౌడ్ గారు, శ్రీ రాజు , చేగుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

