పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు ఎస్పీ మహేందర్
మెదక్ పరివర్తన అవాజ్అక్టోబర్ 21, జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినం (Flag Day) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్, ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మారక స్థూపానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ – ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం. వారు ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వానికి వంతెనగా పనిచేస్తున్నారు అని అన్నారు. మెదక్ జిల్లా 20 సంవత్సరాల క్రితం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నప్పుడు, 14 మంది ధైర్యవంతులైన పోలీసులు తమ ప్రాణాలను అర్పించి, ప్రజలు భయభ్రాంతులేని జీవితం గడపడానికి మార్గం సుగమం చేశారని గుర్తుచేశారు.అదేవిధంగా, భారతదేశంలో మావోయిస్టులను, రౌడీ మూకలను మరియు అసాంఘిక శక్తులను అణచివేయగల శక్తి ఒక్క పోలీసులకే మాత్రమే ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ, వారు చూపించిన త్యాగ మార్గంలో మనం నడవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
అమరవీరుల కుటుంబాలను కలుసుకుని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుందని వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ సందర్బంగా జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ 191 మంది పేర్లను చదివి నివాళ్లుర్పించారు. అనంతరం విధి నిర్వహణ లో మరణించిన తన బ్యాచ్ కు చెందిన మరియు తనతోపాటు విధులు నిర్వహించిన సహచరులను, సిబ్బందిని ఈ సందర్బంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ. ఎస్ మహేందర్ మరియు మెదక్ డియస్పి శ్రీ. ప్రసన్న కుమార్, తూప్రాన్ డియస్పి శ్రీ నరేందర్ గౌడ్ మరియు సైబర్ క్రైమ్ డియస్పి సుభాష్ చంద్ర బోస్ మరియు ఏఆర్ డియస్పి శ్రీ. రంగా నాయక్ మరియు సీఐ లు శ్రీ. మహేష్ గారు, శ్రీ. వెంకట రాజా గౌడ్ , శ్రీ. సందీప్ రెడ్డి వారు, శ్రీమతి రేణుక రెడ్డి మరియు శ్రీ. మధు సుధన్ గౌడ్ , శ్రీ. జర్జ్ గారు, శ్రీ. శైలందర్ గారు, శ్రీ. రామకృష్ణ మరియు ఎసై లు సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


