పోలీసు స్మృతి దినోత్సవం ఘనంగా నిర్వహణ – ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పాల్గొనడం,
పోలీస్ స్మృతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగం..
-పోలీస్ అమరవీరులకు స్థూపానికి పుష్పాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యేలు నాయిని,నాగరాజు …
-అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ వారికి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యేలు, సిపి, కలెక్టర్లు, కమిషనర్..
వరంగల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్) హన్మకొండ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం పోలీస్ స్మృతి పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, వరంగల్ నగర కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఎన్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరులైన పోలీస్ అధికారులకు నివాళులు అర్పించగా, అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ వారికి బహుమతులు అందజేశారు.అనంతరం పోలీస్ హెడ్‌క్వార్టర్ నుంచి మిషన్ ఆస్పత్రి వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు E V శ్రీనివాస్ రావు, వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ , పోలీస్ ఉన్నతాధికారులు,అమరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



