పెండింగ్ ఫీజు బకాయిలు వచ్చేవరకు ఉద్యమిస్తాం
విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం
కామారెడ్డి పరివర్తన ఆవాజ్ నవంబర్ 07: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.లక్షలాదిమంది విద్యార్థులకు సంబంధించిన ఫీజుబకాయలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు యాజమాన్యాలు విద్యార్థులు గురవుతున్నారని, రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కళాశాల యాజమాన్యాలు బంద్ ను నిర్వహిస్తున్నాయని,నేటితో నాలుగో రోజుకు చేరుకోవడం జరిగిందని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్ లో ఉన్న పూర్తి బకాయాలను చెల్లించి న్యాయం చేయాలని అన్నారు. పెండింగ్ ఫీజు బకాయలు వచ్చేవరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరంతర ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యారంగా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు,టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంభాల లక్ష్మణ్ యాదవ్,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు,బివిఎం రాష్ట్ర కార్యదర్శి విఠల్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముధాం అరుణ్,బివిఎమ్ పట్టణ ఇన్చార్జి బుల్లెట్,ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు రాహుల్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

