పెంకుల బాబు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
కామారెడ్డి మున్సిపాల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్ గ్రామంలో చనిపోయిన పెంకుల బాబు కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6300 రూపాయలు 50 kg బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి ధైర్యాన్ని, భవిష్యత్తులో అండగా ఉండమని వ్యవస్థాపకులు అన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, పెద్దలు, శ్రీమాతా సేవ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపనకులకు శ్రీకాంత్ దత్తకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు సాయిరాం, నారాయణరావు, గంగాధర్, చక్రధర్ రావు,13th కౌన్సిలర్ లలిత చిట్టిబాబు, గోపాల్ రావు,రాజు, నర్సింలు, రాజు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

