పిఆర్సి ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించాలి.
గిరిజన సంక్షేమ శాఖ పండిట్, పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు ఇవ్వాలి.
టేకులపల్లి, పరివర్తన అవాజ్ జనవరి 17 టేకులపల్లి :రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయులకు రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పిఆర్సి ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించాలని,గిరిజన సంక్షేమ శాఖలోని పండిట్,పీఈటి పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారంలో జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టిపిటిఎఫ్) నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు.రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు సమ్మె కాలంలో ఇచ్చిన హామీ ప్రకారం సమ్మె కాలానికి జీతాన్ని చెల్లించి,వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని,గిరిజన సంక్షేమ శాఖలోని సిఆర్టిలకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని,ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని,పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు డి.జగన్, టిపిటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పి.సమ్మయ్య, ఉపాధ్యాయులు బి.వెంకటేశ్వర్లు, బి.వాల్య నాయక్,బి.కస్నా నాయక్, మోకాల శ్రీనివాసరావు, డి.వీరన్న,ఎం.రాంబాబు, టి.రామారావు, కె.రమేష్, బి.శ్రీవాణి, జి.బిచ్చ,బి.వీరన్న,జానయ్య పాల్గొన్నారు.

