పరివర్తన అవాజ్ క్యాలెండర్ ఆవిష్కరించిన
టేకులపల్లి గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్.
పాల్గొన్న బేతంపూడి సొసైటీ మాజీ చైర్మన్ లక్కినేని సురేందర్.
తెలంగాణ ధైర్యం అవాజ్ న్యూస్.
టేకులపల్లి పరివర్తన అవాజ్ , జనవరి 21. పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పరివర్తన అవాజ్ ప్రతినిధులు, పాఠకులు, అభిమానులు పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్లో సామాజిక స్పృహను ప్రతిబింబించే అంశాలు, ముఖ్యమైన తేదీలు, పండుగలు, జాతీయ-రాష్ట్ర స్థాయి ప్రాముఖ్యత గల రోజులను పొందుపరిచారు. ప్రజలకు ఉపయోగపడే సమాచారంతో పాటు వార్తా విలువలకు అనుగుణంగా క్యాలెండర్ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా పరివర్తన అవాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే దిశగా పత్రిక నిరంతరం కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో మరింత ప్రజా పక్షపాతంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సాదాసీదాగా, ఆత్మీయ వాతావరణంలో ముగిసింది.ఈ కార్యక్రమంలో పరివర్తన అవాజ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో ధరావత్ సాయి కృష్ణ, టేకులపల్లి గ్రామ సర్పంచ్ బోడ బాలు నాయక్, ఉప సర్పంచ్వసంత అనంతుల,భూక్య దళ్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్ , గుడిపూడి సత్యనారాయణ, వార్డు సభ్యులు బనోత్ జీజ , పెనుబడి సుజాత, బానోతు రామకృష్ణ, భూక్య ఉష, ధరావత్ కోక్య, అజ్మీర కోటేశ్వరరావు, భూక్య బాబురావు, భూక్య దేవా నాయక్, భూక్య బాలకృష్ణ, ధరవత్ కృష్ణ నాయక్, నోముల బానుచందర్, గుగులోతు రామచందర్, గుమ్మడోజు తిరుపతి, భూక్యా లాలు నాయక్, మూడ్ హుస్సేన్ నాయక్, ధరావత్ శంకర్, ధరావత్ లాలు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రజాలు పత్రికా సోదరులు తదితరులు పాల్గొన్నారు.



