నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పై రేగోడులో సమీక్షా సమావేశం – కలెక్టర్ పర్యవేక్షణ”
మెదక్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్) మంగళవారం రేగోడు మండలం రైతు వేదికలో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అమలుపై మెదక్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ,జిల్లా వ్యవసాయ అధికారి రైతులు ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుత దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారాఅధిక దిగుబడి సాధించడమే కాకుండా ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచించారు. ప్రతి రైతు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను సాగు చేసి స్థానిక స్థాయిలో విత్తన ఉత్పత్తిని పెంచడం ద్వారా స్థానిక సాధికారత సాధించవచ్చు అని తెలిపారు.దేశీయంగా తినదగిన నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలని తెలిపారు.జాతీయ నూనె గింజల” అనేది భారత ప్రభుత్వం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ సీడ్స్ (NMEO-నూనె గింజలు) పథకాన్ని సూచిస్తుంది తెలిపారు.. దీని కింద, రైతులకు ఉచితంగా లేదా సబ్సిడీపై మేలిమిరకం విత్తనాలు అందించి నూనె గింజల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.ఆయా ప్రతిపాదనలపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ అవసరమైన అన్నిరకాల సహాయాన్ని జిల్లా యంత్రాంగం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రేగోడు మండలం లో
గోజువాడ గ్రామంలో 1.24 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు 93 శాతం సబ్సిడీతో, 4 క్వింటాళ్ల శనగ 50 శాతం సబ్సిడీ ఉందని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పలు విత్తనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మాట్లాడుతూ ఎంపిక చేసిన మండలాల్లో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల సహకారంతో సు మారు 1500 హెక్టార్లలో వేరుశనగ సాగును ప్రో త్సహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా, ఉత్పాదకత పెంపునకు శిక్షణా కార్యక్రమాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతు పొలంబడులను నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే బిందు సేద్యం ఏర్పాటు కో సం ఉద్యానవన శాఖ సహకారం అవసరమని అన్నారు. పంట విత్తనం దశ నుండి పంట కోత వరకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు చీడపీడల నివారణ వంటి సాంకేతిక అంశాలపై రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సాంకేతిక సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు

