నేచురల్ జ్యూస్ స్టాల్ ప్రారంభించిన డిఎస్పి నరేందర్ గౌడ
పరివర్తన ఆవాస్ అక్టోబర్ 31 రామాయంపేట పట్టణంలో, స్థానిక బస్టాండ్ ఎదురుగా శ్రీ సాయి మెడికల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేచురల్ జ్యూస్ స్టాల్ ను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్సై బాలరాజు గౌరవ అతిథులుగా హాజరై స్టాల్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, ఆరోగ్యకరమైన ఆహారం కూడా అంతే ముఖ్యం అని అన్నారు. ఉదయం వ్యాయామం చేసిన తరువాత ఇలాంటి నాచురల్ జ్యూస్లను తాగడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని తెలిపారు. రామాయంపేటలో ఇలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్ స్టాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.స్టాల్ నిర్వాహకుడిని అభినందిస్తూ మాట్లాడిన సీఐ వెంకట రాజా గౌడ్, పట్టణ ప్రజల ఆరోగ్యానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎస్సై బాలరాజు ఈ వ్యాపారం రోజురోజుకూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం, బిజెపి నాయకులు శంకర్ గౌడ్ తో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు

