ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 27 దాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పక్కాగా కార్యచరణ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం మెదక్ మండలం రాయనపల్లి గ్రామంలో ఐ.కె.పి ధాన్యం కొన్నిగోలు సెంటర్ ను పరిశీలించారు.ఇసందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అన్నదాతలు ఎంతో శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి,ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాలకు వచ్చే చివరి గింజను కొనుగోలు చేసేందుకు జిల్లా లో498 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు .అధికారులు కేంద్రాలను పర్యవేక్షణ చేస్తారని,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాన్యం కొనుగోలు పక్కాగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గన్ని బ్యాగులు,తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, రైతులకు కనీసం మౌలిక వసతులు ,లోడింగ్ అన్ లోడింగ్ లో జాప్యం రాకుండా తగు రవాణా సదుపాయాలు మొదలగునవన్నీ ప్రతీ కొనుగోలు కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా అధికారులను ఆదేశించామన్నారు . ఏ రోజు కా రోజు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ,వాటి వివరాలను రిజిస్టర్ లో, ట్యాబ్ లో నమోదు చేసి వీలైనంత త్వరగా రైతుల ఖాతాలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అధికారులు సిబ్బంది ఉన్నారు.

