ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్
మెదక్ జిల్లా ప్రతినిది నవంబర్ 11 (పరివర్తన అవాజ్) మెదక్ మండలం పాతూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్ మంగళవారం ఆకస్మికం గా సందర్శించారు ఈ సందర్బంగా కలెక్టర్… కేంద్రం లో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్ లను పరిశీలించి. ఎప్పటికప్పుడు వచ్చే ధాన్యం వివరాలను అలాగే కొనుగోలు అయిన వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు తేమ వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసి ట్యాగ్ చేసిన మిల్లు లకు తరలించాలన్నారు
సరిపడా టార్ఫాలిన్ లను అందుబాటులో పెట్టుకోవాలని.. వాతావరణ ప్రతికూల ప్రభావం వలన .వర్షం వచ్చే సూచనలు తెలిసినప్పుడు కేంద్రం లో ఉన్న ధాన్యం తడవకుండా వెంటనే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో ధాన్యం కొనుగోలు సమర్ధవంతంగా నిర్వహించడం జరుగుతుందని ఇప్పటివరకు 70 వేల 100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు అదనపు కలెక్టర్ వెంట కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు

