దుర్గం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ అక్టోబర్ 11 , గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో స్థానికుల సమాచారం మేరకు దుర్గం చెరువులో ఒక వ్యక్తి మృతదేహం నీళ్లపై తేలియాడుతూ ఉందని స్థానికులు తెలుపగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గమనించగా సుమారు 24ఏళ్ల నుండి 27 సంవత్సర వయస్సు కలిగి ఒంటిపై నీలిరంగు చెక్స్ షర్ట్ నలుపు రంగు ప్యాంట్ ధరించి ఎత్తు 5.5 అడుగులు ఉన్న మృతదేహం లభ్యమైందని మృతుడికి సంబంధించిన సమాచారం తెలియరాలేదని అయితే మృతుడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ఈ యొక్క మృతుడి సమాచారం తెలిసినట్లయితే. మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతూ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు విచారణ చేస్తున్నామని మాదాపూర్ పోలీసులు తెలిపారు
