తప్పుల తడకగా మున్సిపల్ ఓటరు ముసాయిదా
తక్షణమే తప్పులను సరి చేయాలి.
మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ళ.మల్లికార్జున్ గౌడ్
పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు డిమాండ్
( పరివర్తన ఆవాస్) మెదక్ పట్టణంలో 32 వార్డుల ఓటరు లిస్టు డ్రాప్టు చేసి పొందుపర్చిన జాబితలో తీవ్ర తప్పిదాలు ఉన్నాయని వాటిని సవరించాలని బిఆర్ఎస్ పట్టణ నాయకులు మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ అన్నారు. శనివారం మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్లు,నాయకులతో కలిసి మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో మున్సిపల్ కార్యాలయం ప్రచురించిన ఓటరు ముసాయిదా జాబితలో పూర్తిగా తప్పులు ఉన్నాయని అన్నారు. ఒక వార్డుకు సంబంధించిన ఓటర్లు మరో వార్డులో రావడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో డ్రాఫ్టు చేసిన విధంగా చేయడం లేదని అన్నారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అధికారులు ఫీల్డ్ లోకి వెళ్ళి 2020 ఏ విధంగా ఉందో డోర్ టు డోర్ , క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపి జాబితాను సిద్ధం చేయాలని ఈ సందర్బంగా కమిషనర్ ను కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కో కన్వీనర్లు గడ్డమీది కృష్ణ గౌడ్, లింగారెడ్డి జుబేర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ లు ఆర్కే.శ్రీనివాస్, మాయ.మల్లేశం,న్యాయవాది జీవన్ రావు,నాయకులు ప్రభు రెడ్డి, మోచి. కిషన్,ఏనుగుల.రాజు, మెడిశెట్టి.శంకర్,గోపాల్,ఫాజిల్, రుక్మ చారి,మెహన్,లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.

