తడిసిన మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి,
తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్ డిమాండ్ చేశారు.
పరివర్తన ఆవాజ్. అక్టోబర్ 25 మహబూబాబాద్ గార్ల మండలంలోని మర్రిగూడెం, సిరిపురం, నగరం, బాలాజీ తండా, సీతంపేట గ్రామాలలో శనివారం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సర్వే చేసి తడిసిన మొక్కజొన్న పంటలను మరియు వరి పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న అకాల వర్షాలకు మొక్కజొన్న పంట తడిసి రైతులు నష్టపోయారు వెంటనే తడిసిన మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంట చివరికి చేతికి అందకుండా అకాల వర్షాలకు నష్టపోయి రైతులు లబోదిబోమంటూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని కోరారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తాము అన్ని విధాలుగా ఆదుకుంటాము అని హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు భారతదేశానికి రైతు వెన్నెముక గా చెప్పబడుతున్న మన దేశంలో రైతులకు సరైన న్యాయం చేసే పద్ధతిలో పాలక ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి ఆలంబిస్తూ రైతులకు మోసం చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తడిసిన పంటలను కోనుగొలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు భూక్య పుల్ సింగ్, బానోత రమేష్, బి శ్రీను మరియు రైతులు బానోత్ వాల్య, బి.బాలు, ధరావత్ కళమ్మ, లావుడియా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

