జూబ్లీహిల్స్ లో నైతికంగా బీఆర్ఎస్ పార్టీదే విజయం -రవీందర్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది
ఈ ఎన్నిక రౌడీయిజంతో జరిగింది
అక్రమాలతో గెలిచిన చరిత్ర కాంగ్రెస్ ది
ఈసీ పూర్తిగా విఫలం అయ్యింది
శేరిలింగంపల్లి యువ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ధ్వజం
కేటీఆర్ నాయకత్వంలో మరింతగా జనంలోకి వెళ్తాము
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 15
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్రమంగా విజయం సాధించ్చిందని శేరిలింగంపల్లి యువ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించి ఓట్లు వేయించుకున్నారు అని మండిపడ్డారు. ఈ ఎన్నిక రౌడీయిజంతో జరిగిందని విమర్శలు గుప్పించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రవీందర్ యాదవ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ గెలుపు అసలు గెలుపే కాదని, నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మరింతగా జనంలోకి వెళ్తాము అన్నారు. కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై ప్రజా పోరాటాలు చేస్తాము అని రవీందర్ యాదవ్ వెల్లడించారు.
