జనాభా కు తగిన విధంగా బిసిలకు రాజకీయ రిజర్వేషన్ లు పెంచాల్సిందే.
తడికల శివకుమార్ బిఎస్పీ జిల్లా అధ్యక్షులు
పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 27: ప్రస్తుతం ఉన్న 27% బీసీ రిజర్వేషన్స్ సాధించడం లో బి.ఎస్. పీ పార్టీ కీలక పాత్ర పోషించింద నీ, “ఎవరి జనాభా ఎంతో – వారి వాటా అంత” అనే నినాదం తో దేశంలో పుట్టిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనీ నేడు తెలంగా ణ రాష్ట్రము లో న్యాయ మైన వాటా కోసం జరుగు తున్న 42% బీసీ రిజర్వే షన్స్ పోరాటా నికి బి. ఎస్. పీ పార్టీ పూర్తి మద్దత్తు ఉంటుందని బిఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్ తెలిపారు. ఈ సందర్బంగా బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణం లో42శాతం బీసీ రిజర్వేషన్స్ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్స్ 42 శాతం అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్స్ అమలు కోసం బిఎస్పీ పార్టీ చేసిన పోరాటాన్ని, బహుజన మహనీయుల రాజకీయ ఉద్దేశాన్ని మొత్తం సమాజానికి వివరించి చెప్పాలని బిఎస్పీ జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్ గారు జిల్లా బిఎస్పీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి కోళ్లపుడి ప్రవీణ్, జిల్లా కోశాధికారి పీకా మల్లికార్జున్, జిల్లా ఆఫీస్ కార్యదర్శి యనగంటి సంపత్,జిల్లా కార్యదర్శి భూక్యా ముత్యాలు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ చార్జ్ కొండగొర్ల రమేష్, మహిళా నాయకురాలు గుగులోత్ సరోజ తదితరులు పాల్గొన్నారు.

