చల్లసముద్రం రాజకీయాల్లో కొత్త దిశ! BRS నేతలు కాంగ్రెస్లో చేరారు
పరివర్తన అవాజ్ చల్లసముద్రం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం,చల్లసముద్రం గ్రామపంచాయతీలో రాజకీయ రంగంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. స్థానిక రాజకీయ రంగంలో విశేష గుర్తింపు పొందిన బిఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు ఎట్టి కోటయ్య మరియు బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ సభ్యురాలు మూతి వసంత ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ ప్రజలు, యువత, స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని ఉత్సాహంగా స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, ఇరు నాయకులు గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకై కృషి చేస్తానని తెలిపారు.

