
ఇల్లందు, నవంబర్ 23 (పరివర్తన అవాజ్):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఇందిరా మహిళా శక్తి’ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీ పరిధిలో ఘనంగా జరిగింది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ తాటి చుక్కమ్మ ముఖ్య అతిథిగా హాజరై, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ఉచిత చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ తాటి చుక్కమ్మ మాట్లాడుతూ, మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పంలో భాగంగానే, మహిళలందరినీ ప్రోత్సహించడానికి ఈ ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ చేపట్టడం జరిగిందని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి ఆరు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీసీ లాలయ్యా మహిళా సంఘాల సభ్యులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తాటి బిక్షం, పబ్బు శివ మరియు ముఖ్య నాయకులు మాసబత్తిని వెంకటరమణ, కుర్ర శ్రీను, సట్ల శ్రీనివాస్, మోడెమ్ కోటయ్య,నాగుల మీరా, దనియాకుల బాబు, కావేటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

