పరివర్తన అవాజ్ నవంబర్ 14, 2025: ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు మండలం, చల్ల సముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాలరావు చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100% రాయితీతో మత్స్యకారులకు ఉచితంగా అందజేస్తున్న చేప పిల్లలను ఎమ్మెల్యే గారు అధికారులు మరియు సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు చెరువులో వదిలారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం మత్స్యకార సంస్థలను అభివృద్ధి పరిచేందుకు వడివడిగా అడుగులు వేస్తుందని తెలిపారు. పెద్ద చెరువులతో పాటు చిన్న కుంటలకు కూడా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని, చేపల పెంపకం ద్వారా సంఘ సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది ‘ఇందిరమ్మ ప్రభుత్వం’ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపీపీ మండల రాంమహేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్, సీనియర్ అసిస్టెంట్ నూరిధ్ధిన్, సహకార సంఘం జిల్లా అధ్యక్షులు జోగ బుచ్చయ్య, గోపాలరావు చెరువు మత్స్యశాఖ సహకార సంఘం సభ్యులు ఇర్ప పోతురాజు, బర్ల రాముర్తి, పెనబోయన హనుమంతు, అలెం కృష్ణ, బండి ఆనంద్, పూనెం శ్రీరాములు, తాటి మంగయ్య, ఎట్టి కోటయ్య, సనప హనుమంతు, పోటు రవి,ధనసింగ్,వీరభద్రం, మూతి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
గోపాలరావు చెరువులో ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా ఉచిత చేప పిల్లల పంపిణీ
Related Posts
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
© 2025 Parivarthana Awaaz . Designed by Creativals.com.
