క్రీడా పోటీల్లో విజేతలకు అభినందనలు తెలిపిన
జిల్లాఎస్పీ డి. వి. శ్రీనివాస్ రావు,
రైసింగ్ డే వేడుకలలో భాగంగా రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీల తుది మ్యాచ్‌లు ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు హాజరై రమాయంపేట్ సర్కిల్ మరియు మెదక్ సర్కిల్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత వాలీబాల్ ఫైనల్‌ను వీక్షించారు. ఈ పోటీలో మెదక్ సర్కిల్ అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి స్థానం, రామాయంపేట సర్కిల్ ద్వితీయ స్థానం సాధించాయి. కబడ్డి పోటీల్లో అల్లాదుర్గ్ సర్కిల్ మొదటి స్థానం, రామాయంపేట సర్కిల్ రెండవ స్థానం కైవసం చేసుకున్నాయి.
మ్యూజికల్ చైర్ పోటీలో భూలి మొదటి స్థానం, లావణ్య ద్వితీయ స్థానం సాధించి మంచి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, రైసింగ్ డే సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో హోమ్ గార్డ్ సిబ్బంది చూపిన ప్రతిభ నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి ఆసక్తి, క్రమశిక్షణతో భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనే స్థాయికి ఎదగాలని సూచించారు. హోమ్ గార్డ్ సిబ్బందికి రైసింగ్ డే సందర్బంగా క్రీడాలు నిర్వహించడంపై సిబ్బంది ఆనందం వ్యక్తం చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డియస్పి రంగా నాయక్, ఆర్ఐ లు రామ కృష్ణ, శైలందర్, ఆర్ ఎసై లు సిబ్బంది ఉన్నారు.

