కామారెడ్డిలో అమ్మ భగవాన్ ఆలయంలో భక్తి పూర్వక అన్నదాన కార్యక్రమం
పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 14; కామారెడ్డి పట్టణంలోని అమ్మ భగవాన్ ఆలయంలో ఈరోజు భక్తి పూర్వకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు పాల్గొని భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా దీపం జ్యోతి పరంజ్యోతి అమ్మవారి భక్తులు మరియు ఎర్ర విజయ గుప్తా పాల్గొని సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో సత్సంగం నిర్వహించి, భగవాన్ తత్వంపై మంత్రోచ్చారణలు చేశారు. భక్తి వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

