కంభాలపల్లి గ్రామంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య
పరివర్తన ఆవాజ్ నవంబర్ 11 , తెలంగాణ మార్క్ పెయిడ్ సౌజన్యంతో బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో మంగళవారంమొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మండల పరిధి కంబాలపల్లి గ్రామంలోఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ,సింగిల్ విండో చైర్మన్ ,మూల మధుకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను మండలానికి ఒకటి మాత్రమే మంజూరు చేశారని, అందులో భాగమే బయ్యారం సహకార సంఘానికి కూడా ఒక కొనుగోలు సెంటర్ ని మంజూరు చేయగా ఆ విషయాన్ని సింగిల్ విండో చైర్మన్ మూలమందుక రెడ్డి నా దృష్టికి తీసుకురాగా వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుని కలిసి బయ్యారం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమని ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులంతా ఎక్కువగా మొక్కజొన్న పంటలను పండిస్తారని కాబట్టి కంబాలపల్లి గ్రామన్ని సెంటర్ గా పరిగణించి మరొక మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయించామని తెలిపారు. ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని మొక్కజొన్న పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర 2400 రూపాయలు ఇస్తుందని తెలిపారు. అలాగే రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు పంట ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని కోరారు.అంతే కాదు పట్టా లేని రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు. రైతులెవ్వరు కూడా దళారుల మాయలో పడి మోసపోవద్దని, రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో పంట ను అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏఎంసి చైర్మన్ రాంబాబు, వైస్ చైర్మన్ బిజ్జా వెంకటేశ్వర్లు, డైరెక్టర్ తెల్లం బిక్షం, మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మోహన్ జీ, సంఘ కార్యనిర్మాణాధికారి రేగళ్ల సురేందర్, ఏ ఈ ఓ ఎండి ఫయాజ్, స్టాఫ్ అసిస్టెంట్ తుడుం రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాసమల్ల నాగేశ్వరరావు, తొట్టి కృష్ణ, రైతులు లాలు, మంగీలాల్, పాండు, సంఘ సిబ్బంది సురేష్, ముధాకర్ తదితరులు పాల్గొన్నారు..

