ఎమ్మెల్యే కావడమే తన లక్ష్యం కంటారెడ్డి తిరుపతిరెడ్డి
లక్ష రూపాయల తో
నీటి శుద్ధి ప్లాంట్ కేంద్రాన్ని ప్రారంభించిన తిరుపతిరెడ్డి
రామాయంపేట పరివర్తన ఆవాజ్ నవంబర్ 21 , ఎమ్మెల్యే కావడం తన లక్ష్యమని లక్ష్య సాధన కోసం నిర్విరామ కృషితో పాటు, పేదల అభ్యున్నతికి పాటు పడతానని BRS పార్టీ మెదక్ నియోజకవర్గం ఇంచార్జ్ కo టారెడ్డి తిరుపతిరెడ్డి తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం బిఆర్ఎస్ మెదక్ నియోజకవర్గం ఇంచార్జ్ కంట రెడ్డి తిరుపతిరెడ్డి నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని సంకల్పంతో తన సొంత ఖర్చులతో సుమారు లక్ష రూపాయలు వేచ్చించి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం నాడు ఆయన ప్రారంభించారు. విద్యార్థులు ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగి అనుకొన్న లక్ష్యాన్ని సాధించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరానని, తన లక్ష్యం ఎమ్మెల్యే కావాలని ఉందని దాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పార్టీ నాయకులు అందె కొండల్ రెడ్డి, నరసారెడ్డి, చింతల ఏసు పాల్, రొయ్యల హరి, చింతల రాములు, నవాత్ మహేష్, మద్దెల రమేష్, శ్యామ్ రెడ్డి, రాజేందర్ గుప్తా, భానుచందర్, ఎస్.కె హైమద్, హస్నుద్దిన్, శ్రీకాంత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

