ఇన్ సర్వీస్ టీచర్ల టెట్,సిపిఎస్ ను రద్దు చేయాలి.
1. ఎన్.ఈ.పి-2020 ను రద్దు చేయాలి
2. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక పాఠశాలల
ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలి
3. టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి పరివర్తన అవాజ్ జనవరి 09, ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్(ఏఐజేఏసిటీఓ) పిలుపులో భాగంగా యూఎస్పిసి,టిపిటిఎఫ్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టేకులపల్లి మండలశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను రద్దు చేయాలని,సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని,న్యూ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ను రద్దు చేయాలని,టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని నినదీస్తూ నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ మాట్లాడుతూ! గత 30 సంవత్సరాలుగా సర్వీసు చేసిన ఉపాధ్యాయులకు ఇప్పుడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసి రెండు సంవత్సరాలలో ఉత్తీర్ణులు కావాలని లేని యెడల ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరైనది కాదని,ఉద్యోగ నియామక నోటిఫికేషన్లలో పేర్కొన్న విద్యార్హతల ప్రకారమే ఉద్యోగాలు పొందినప్పటికీ ఇప్పుడు కొత్తగా టెట్ పరీక్ష రాయాలని,లేనియెడల ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరైనది కాదని,ఇటువంటి నిర్ణయాలను వెంటనే విరమించుకోవాలని చెప్పారు.విద్యా హక్కు చట్టం 2009కి తరువాత నియమించబడిన ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయించాలని,అందుకు తగినట్టుగా విద్య హక్కు చట్టాన్ని అమెండ్మెంట్ చేయాలని కోరారు.ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం కలిగించే సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని,న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రద్దు చేయాలని అన్నారు.ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నందున అందరికీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలన్నారు.పై డిమాండ్ల సాధన కొరకు రేపు ఉపాధ్యాయులందరము ఈ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మెమొరాండాన్ని రాష్ట్రపతి,ప్రధానమంత్రికి సమర్పిస్తామని,అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే ఫిబ్రవరి 5న జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మండలం ప్రధాన కార్యదర్శి పూనెం సమ్మయ్య,మండల కార్యదర్శి జి.నందా,ప్రధానోపాధ్యాయులు డి.జగన్,ఉపాధ్యాయులు టి.రామారావు బి.వాల్యా నాయక్,బుగ్గ వెంకటేశ్వర్లు,ఏ.కిషన్,బి.కస్నా నాయక్,ఎం.శ్రీనివాసరావు,డి.వీరన్న, కె.ఎర్రయ్య,టి.బిక్షమయ్య,ఎం.రాంబాబు,బి.వీరన్న, కె.రమేష్,బి.శ్రీవాణి,జి.బిచ్యా,గోపాలీలలు,జానయ్య పాల్గొన్నారు.

