అయ్యప్ప స్వాములకు విరాళం ఇచ్చిన సర్పంచ్ తారా చంద్ నాయక్.
టేకులపల్లి, పరివర్తన అవాజ్ జనవరి 09, టేకులపల్లి కొత్త తండా జీ గ్రామ పంచాయతీ సర్పంచ్మాలోత్ తారాచంద్ నాయక్ గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకట్యా తండా గ్రామంలో అయ్యప్ప స్వామీ దీక్షల చివరి రోజు సందర్భంగా నిర్వహించిన ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాముల సేవలో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఖర్చుల నిమిత్తం రూ. 9,500/- నగదు విరాళంగా అందజేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలోని మంగ్యతండా గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప స్వామీ దీక్ష ఇరుముడి కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొని స్వాములకు తన సహకారాన్ని అందజేశారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నేను ఎల్లప్పుడూ సహకరిస్తూ గ్రామ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న సర్పంచ్ సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు.

