అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ
జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అదంపు ఎస్పి ఎస్. మహేందర్
పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 27, మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి రాందాస్ చౌరస్తా మీదుగా వెల్కమ్ బోర్డు వరకు ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ, తిరిగి రాందాస్ చౌరస్తా వద్ద ముగిసింది. జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో విధి నిర్వహణలో 14 మంది పోలీసులు ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా, ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సెంట్రల్ మరియు రాష్ట్ర పోలీస్ విభాగాల 191 మంది సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. ఈ బైక్ ర్యాలీ ద్వారా మన అమరవీరులను స్మరించుకుంటూ, వారి త్యాగం వెళకట్టలేనిదని గుర్తుచేసుకుంటు సాగింది, వారి సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్ , ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాయక్ , మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేష్ , ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్. సందీప్ రెడ్డి , ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక యువత పాల్గొన్నారు.

