అత్యాచారం చేసిన కేసును చేదించిన పోలీసులు
పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 14 ; గత శనివారం కొల్చారం మండలం ఏడుపాయల మూడవ బ్రిడ్జి వద్ద గిరిజన మహిళ పైఅత్యాచారం జరిగిన సంఘటన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందిన సంఘటన తెలిసింది ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది నిందితుడి కోసం ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిందితుడి కోసం దర్యాప్తు వేగవంతం చేశారు మెదక్ పట్టణంలోని అన్ని సిసి టీవీ ఫుటేజ్ లను చూడగా మెదక్ ఓల్డ్ బస్టాండ్ సమీపంలోని ఒక వైన్ షాప్ వద్ద ఉన్న సీ.సీ.టీవీ
ఫుటేజ్ ద్వారా నిందితుడిని మరణించిన మహిళతో మాట్లాడినట్టు అనంతరం వారిద్దరూ నడుచుకుంటూ వెళ్లినట్టు సిసి టీవీ ఫుటేజ్ లో చూడడంతో నిందితుడిని పట్టుకొని విచారించగా నిందితుడు మెగావత్ ఫకీరా నాయక్ పని ఇప్పిస్తానంటూ మహిళను ఏడుపాయల దేవస్థానం దారిలోని మూడవ వంతెన దాటిన తర్వాత గాలి అనిల్ కుమార్ వెంచర్ వెనుక చెట్ల మధ్యకు తీసుకెళ్లి లైంగికంగా దాడి చేయడానికి బట్టలు విప్పి
ఆ బట్టలతో కాళ్లు చేతులు కట్టేసి మానభంగం చేసి రాయితో తలపై బలంగా కొట్టి చనిపోయిందనుకొని మహిళా పై ఉన్న ముక్కుపుడక దొంగిలించి పారిపోయాడు సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన పోలీసులు నిందితుని కోసం గాలించగా నిందితుడు మెదక్ చర్చి వెనకాల ప్రాంతంలో పోలీసులు అదుపులో తీసుకున్నారని ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు నేరస్థుడు ఫకీర్ నాయక్ అంబుజిగూడ తండా వట్టిపల్లి మండలం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని తెలిసింది నిందితుడి పై మెదక్ టౌన్ మరియు అల్లాదుర్గ కేసులు విచారణలో ఉన్నాయి నిందితుడు ఇదివరకు మెదక్ టౌన్ కేసులో కూడా సేమ్ ఇదేవిధంగా పరిచయం చేసుకొని రేప్ చేసి చంపాడు డబ్బుల కోసం అదేవిధంగా మెదక్ రూలర్ లో ఇంకో మహిళను పరిచయం చేసుకొని అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని
తెలిపారు నిందితుడి వద్ద నుండి మృతురాలి ముక్కుపుడక నిందితుడు వాడిన రాయి కట్టే మరియు బట్టలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ డి.వి శ్రీనివాసరావు తెలిపారు కేసును వేగంగా ఛేదించినందుకు మెదక్ రూలర్ సీఐ సిబ్బందికి సిసిఎస్ టీంకు ఎస్పీ అభినందనలు తెలిపారు

