పరివర్తన అవాజ్ దిన పత్రిక సెప్టెంబర్ 20 హన్మకొండ
వర్ధన్నపేట నియోజకవర్గంలోని 14వ డివిజన్ మణికంఠ కాలనీ, శ్రీనివాస కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆదివారం సందర్శించి, వినాయకులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించి, భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు స్టాలిన్, ఈర్ల రాజేందర్, సంతోష్, జానీ, శివ పటేల్, శంకర్, శ్రీనివాస్, అశోక్, చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




