Sunday, September 20, 2026
Home People **భూభారతి రీ-సర్వేపై గ్రామస్థులకు అవగాహన కల్పించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద*

**భూభారతి రీ-సర్వేపై గ్రామస్థులకు అవగాహన కల్పించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద*

0
5

📰 Generate e-Paper Clip

 

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక ;   వరంగల్, సెప్టెంబర్ 19:

నల్లబెల్లి మండలం అర్షనపల్లి గ్రామంలో భూభారతి రీ-సర్వేపై నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూభారతి రీ-సర్వే ప్రక్రియ, భూ వివరాల నమోదు, సర్వే సమయంలో భూ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రీ-సర్వే ద్వారా కలిగే ప్రయోజనాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.రీ-సర్వే ప్రక్రియలో గ్రామస్థులు సహకరించాలని, తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు.భూ వివరాల్లో ఏవైనా తేడాలు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.గ్రామ సభలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, ఏడి సర్వే మరియు రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, నల్లబెల్లి తహసిల్దార్ కృష్ణా ,ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.