వర్షానికి తడిసిన ధాన్యం.. రైతుల ఆవేదన!
బస్వాపూర్ పరివర్తన అవాజ్:బస్వాపూర్‌లో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బుధవారం రాత్రి దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండగా, మిల్లర్లు ధర తగ్గిస్తున్నారనే ఆందోళనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలపై ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.