కల్వర్‌రాల్ కాంప్లెక్స్‌లో హరివంశ్ రాయ్ బచ్చన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

పరివర్తన అవాజ్ సదాశివనగర్  : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని కల్వర్‌రాల్ కాంప్లెక్స్ సమావేశంలో ప్రముఖ హిందీ కవి, రచయిత హరివంశ్ రాయ్ బచ్చన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరివంశ్ రాయ్ బచ్చన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందీ సాహిత్యానికి ఆయన చేసిన సేవలను, రచనల ద్వారా సమాజానికి అందించిన సందేశాలను వక్తలు గుర్తుచేసుకున్నారు. హిందీ భాషా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్ రెడ్డి, హిందీ ఫోరం జిల్లా...