పరివర్తన అవాజ్ ఘనపూర్: NFHC ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పదో తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు పాలిసెట్ (POLYCET) ప్రవేశ పరీక్ష పుస్తకాలను పంపిణీ చేశారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు, శాస్త్రవేత్త మోహన్ ప్రేరణతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ సామాజిక సేవకులు మహమ్మద్ అస్లాం , ఘనపూర్ మాజీ సర్పంచ్ సుధర్శన్ గౌడ్ పాల్గొన్నారు. NFHC ఫౌండేషన్ నేషనల్ జాయింట్ సెక్రటరీ భూక్య అక్షిత విద్యార్థులకు పదో తరగతి అనంతరం ఉన్నత విద్యా అవకాశాలు, పాలిసెట్ ప్రాముఖ్యత, వివిధ కోర్సులు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కాలర్‌షిప్‌ల గురించి అవగాహన కల్పించారు.విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజురాణి , ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.