ఇసన్నపల్లి కాలభైరవ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్

ఇసన్నపల్లి పరివర్తన అవాజ్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ కాలభైరవ స్వామిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వేద పండితులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ హనుమంతరావును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ఇసన్నపల్లిలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన క్షేత్రమని పేర్కొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల...