Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 2:07 pm Posted by : parivarthanaawaaz

ఇసన్నపల్లి కాలభైరవ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్

ఇసన్నపల్లి పరివర్తన అవాజ్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ కాలభైరవ స్వామిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వేద పండితులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ హనుమంతరావును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ఇసన్నపల్లిలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన క్షేత్రమని పేర్కొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం సంతోషకరమన్నారు.ఆలయ విశిష్టతను, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడుతూ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చింతల శంకర్, ఏవో ప్రభు, రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్, ఇసన్నపల్లి సర్పంచ్ దోతి లచ్చయ్య, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు