జూదం, పేకాట కట్టడికి 4 ప్రత్యేక పోలీసు బృందాలు
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : జిల్లాలో జూదం, పేకాట కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టే లక్ష్యంతో జిల్లా ఎస్పీ నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ జిల్లావ్యాప్తంగా జూదం నిర్వహించే ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేస్తాయి. ముందస్తు సమాచారాన్ని సేకరిస్తూ ఎక్కడైనా జూదం, పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతాలకు చేరుకొని ఆకస్మిక దాడులు నిర్వహిస్తాయి. జూదం నిర్వాహకులు, పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాయి. ఈ సందర్భంగా జిల్లా...