Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 5:18 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

–స్త్రీ ఇంట, బయట, సమాజంచే గౌరవించబడినప్పుడే దేశానికి నిజమైన గౌరవం-అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి—

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 26

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆద్వర్యంలో చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి  అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం (International Day for the Elimination of Violence against Women) సందర్భంగా హన్మకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రమంలో “స్త్రీ శక్తి – ఆలోచన – ఆచరణ” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ సృష్టి కి మూలం అయిన స్త్రీ హింసను ఎదుర్కోవడం దౌర్భాగ్యం అని, స్త్రీ ఇంట, బయట ,సమాజంచే గౌరవించ బడినప్పుడే దేశానికి నిజమైన గౌరవం దక్కినట్లు అనితా రెడ్డి అన్నారు , తన ఆలోచనలను ఆచరణలో పెట్టే ధైర్యము, చేయుత అందించాలి అంతేకాని, ఓ పక్క పుణ్యం కావాలని పుణ్య క్షేత్రాలు తిరుగుతూ పొర్లు దండాలు పెడుతూ, దక్షణలు వేస్తూ ఇంకో పక్క ఆడపిల్లలను చిదిమేస్తూ కొందరు అరాచకాలకు పాల్పడే వారు కొందరు, నేను మగవానిని అన్న అహంతో భార్యని హింసించే వారు కొందరు, నేను మగవాడిని కన్నా అన్న అహంతో కోడలిగా వచ్చిన పిల్లను వారి తల్లి దండ్రులను అగౌరపరిచెవారు ఇంకొందరు..ఓ పక్క పాపం మూట కట్టుకొంటూ రోజు పూజలు చేస్తూ గంగలో మునిగితే మాత్రం ఆ పాపం పోతుందా, దేవుడు క్షమిస్తాడా?ముందు స్త్రీ ని గౌరవించాలి, ఆడ పిల్లలని ప్రేమించాలి… బంధాలకు విలువ ఇవ్వాలని అప్పుడే కనీసం మనిషి మనిషి లా అన్న మిగులుతారని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, మహిళలని ఉద్దేశించి మీరు నడిచే మార్గం,నడవాలనుకున్న మార్గములో ఆటంకాలు ఎదురైతే ఆగి పోకూడదని మీ ప్రయత్నమే కొత్తదారి అవుతుందని లేదా దాన్ని మహిళలే సృష్టించుకునే దైర్యం మహిళలది కావాలని పిలుపు నిచ్చి మహిళలకు దైర్యం, ప్రోత్సాహం అందించారు, ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి తో పాటు స్వధార్ నిర్వాహకురాలు శైలజ, మహిళలు పాల్గొన్నారు.