ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. ఏటికొప్పాకలో పోలీసుల పర్యవేక్షణ
అనకాపల్లి జిల్లా పరివర్తన ఆవాజ్ : ఏటికొప్పాక గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏటికొప్పాకలో పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఆదివారం జరగనున్న ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.పరవాడ సీఐ భాస్కరరావు, ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర పోలీసు సిబ్బందితో కలిసి ఏటికొప్పాకలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, కేంద్రాల పరిసరాలు, భద్రతాపరమైన అంశాలు, రాకపోకల మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల...