Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 4:39 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

–దివ్యాంగుల పట్ల చూపించాల్సింది జాలి కాదు ప్రేమ, చేయుత…అంధులు మనో నేత్రంతో చూడగలరు-అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి…

హన్మకొండ  పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 27

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి వరంగల్ ఆటోనగర్ లోని లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల సందర్శించి పిల్లలతో ఆత్మీయ స్పర్శనందించి వారి బాగోగులు అడిగి తెలుసుకుని వారి కేర్ అండ్ ప్రొటెక్షన్ పరిశీలించారు పిల్లల చెస్ వంటి ఆటలు ఆడి చూపించి చక్కగా పాటలు పాడి వినిపించారు అనంతరం పిల్లలందరికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ… అంధులైనవారు కళ్ళతో చూడలేక పోయిన మనో నేత్రంతో చూడగలరని , వారి ప్రతిభ ఎప్పుడు ఆశ్చర్యపరుస్తుందని అన్నారు దివ్యాంగుల పట్ల జాలి చూపే కంటే ప్రోత్సాహించి చేయుతనందించాలని అన్నారు , ఆశ్రమాలు నడిపే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ,లైసెన్స్ కలిగి ఉండి, జువెనల్ జస్టిస్ చట్టం (JJ Act) ప్రకారం నిర్వహిస్తూ పిల్లలతో ప్రేమగా ఉంటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని అన్నారు, తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని డాక్టర్ అనితా రెడ్డి తెలియ చేసారు ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, నిఖిల్, శ్రేయ, దివ్య, వారుష్ , శివ, మణి పాల్గొన్నారు.