డిగ్రీ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి… —విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

వరంగల్ జిల్లా పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 27  జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన డిగ్రీ కళాశాల కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని కళాశాలల పనితీరుపై సమీక్షించారు.ఈ సందర్భంగా కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, బోధనా ప్రమాణాలు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థులకు...