వరంగల్ జిల్లా పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 27
జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన డిగ్రీ కళాశాల కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని కళాశాలల పనితీరుపై సమీక్షించారు.ఈ సందర్భంగా కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, బోధనా ప్రమాణాలు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న విద్యా సౌకర్యాలు తదితర అంశాలను సమీక్షించారు. కళాశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించాలని, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు విద్యాపరంగా రాణించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో కమిటి కన్వీనర్ నర్సంపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్, ప్రాజెక్ట్ డైరెక్టర్, డీఆర్డీఓ, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఎ. నారాయణరెడ్డి, ఈఈ ఆర్ అండ్ బీ రాజేందర్, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ. పుష్పలత,జిల్లా పౌర సంబంధాల అధికారి బి. ప్రేమలత, మైనారిటీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి. రమేష్,జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.డి. హమీద్,జిల్లా ఉపాధి అధికారి బి. సాత్విక, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎ. నరసింహమూర్తి, ఆర్టీఓ పి. రంగారావు, టీజీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. రాంబాబు, జిల్లా యువజన సంక్షేమ అధికారి బి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.