Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 9:56 am Posted by : KUNDHURU ANAND

ఏటికొప్పాకలో ఓటరు తీర్పే కీలకం.. సర్పంచ్ పీఠంపై స్వతంత్రుడా? కూటమి అభ్యర్థా?”

అనకాపల్లి జిల్లా పరివర్తన అవాజ్ : ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో సర్పంచ్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా అన్నం వెంకట్రావు, కూటమి మద్దతుతో యన్నాంశెట్టి సన్యాసిరావు పోటీ చేస్తుండడంతో గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఇద్దరు అభ్యర్థులు తమదైన ప్రచార శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, గ్రామ ప్రజల మద్దతు ఎవరికి లభిస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు స్వతంత్ర అభ్యర్థి, మరోవైపు కూటమి మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థి.. ఈ పోటీలో ఓటర్ల నిర్ణయం కీలకంగా మారనుంది.ఆదివారం జరగనున్న ఎన్నికల్లో ఏటికొప్పాక ఓటర్లు ఎవరికి మద్దతు తెలుపుతారు? స్వతంత్ర అభ్యర్థి అన్నం వెంకట్రావును గెలిపిస్తారా? కూటమి మద్దతు అభ్యర్థి యన్నాంశెట్టి సన్యాసిరావుకు పట్టం కడతారా? అన్న ఉత్కంఠ నెలకొంది. గ్రామ సర్పంచ్ పీఠం ఎవరిని వరిస్తుందో తేల్చనున్న ప్రజా తీర్పుపై రాజకీయ వర్గాలతో పాటు గ్రామ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.