Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:02 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

TNGOs ఆధ్వర్యంలో ఐడీఓసీ (IDOC) సముదాయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి….

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 14

హనుమకొండ జిల్లా TNGOs ఆధ్వర్యంలో ఐడీఓసీ (IDOC) సముదాయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి వారి సతీమణి  నాయిని నీలిమా రాజేందర్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  చాహత్ బాజ్‌పాయ్, CMD  వరుణ్ రెడ్డి IAS, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఉద్యోగులందరూ ఉత్సాహంగా, వినూత్న ఆలోచనలతో బతుకమ్మ సంబరాలను మరింత ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తమ తమ శాఖల ప్రత్యేకతలను ప్రతిబింబించేలా రూపొందించిన బతుకమ్మలను తీసుకురావడం అభినందనీయమని తెలిపారు.బతుకమ్మ పండుగ మహిళలకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడిపే అపూర్వమైన సందర్భమని అన్నారు. పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం ఈ పండుగలోని ప్రత్యేకత అని పేర్కొన్నారు.తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు.ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.