పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్, సీ.పీ అమరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతానికి కృషి విధి నిర్వహణలో అసువులు బాసిన అమరులకు ఘన నివాళులు పరివర్తన ఆవాజ్ నిజామాబాద్, అక్టోబర్ 21 : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, అమరులైన పోలీసులను స్మరించుకోవడం,...